విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ధమ్కీ' ప్రీరిలీజ్ శుక్రవారం రాత్రి శిల్పా కళా వేదికలో నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ హాజయ్యారు. అయితే ఇదే వేదికపై తారక్ గురించి హైపర్ ఆది మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.



'నందమూరి తారక రామారావు గారు. ఆ పేరు పెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. నిలబెట్టుకోవాలంటే ఇంకా ధైర్యం కావాలి. కానీ దాన్ని నిలబెట్టి, తొడగొట్టి దటీజ్ ఎన్టీఆర్ అని ప్రూవ్ చేశారు ఎన్టీఆర్. వచ్చిన కొత్తల్లో తాతకు మనవడు అన్నారు. 'ఆది' సినిమా రిలీజయ్యాక తాతకు తగ్గ మనవడు అన్నారు. ఆ సినిమా నుంచి ఇప్పుడు RRR సినిమా వరకు తాతే మనవడి రూపంలో పుట్టాడని అంటున్నారు. అతను ఇప్పుడు యంగ్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్, కానీ ఓ 70 ఏళ్లు వచ్చాక ఆయనే మనకు సీనియర్ ఎన్టీఆర్ (Senior NTR). డైరెక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పడం మర్చిపోయి అలానే చూస్తుండిపోయే నటన ఆయనకు మాత్రమే సొంతం. ముఖంతోనో, మాటతోనో ఎక్స్ప్రెషన్ పలికించడం పెద్ద విషయం కాదు. కానీ కళ్లతో కూడా ప్రతి ఎక్స్ప్రెషన్ పలికించగల నటుడు ఎన్టీఆర్. ఇక కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఒకరికొకరు అండగా నిలబడే విషయం ప్రతి అన్నదమ్ములకు ఆదర్శం' అని తారక్ గురించి గొప్పగా చెప్పుకొచ్చిన ఆది.. RRR మూవీ ఆస్కార్ పొందడం గురించి కూడా మాట్లాడాడు.

Post a Comment