బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవికి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది ముద్దుగుమ్మ. అయితే తాజాగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది జాన్వీ. అది కూడా Man Of Masses NTR ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్లో అవకాశం రావడం పట్ల జాన్వీ కపూర్ స్పందించింది. ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 



జాన్వీ కపూర్ మాట్లాడూతూ.. 'ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేసే అవకాశం వస్తే బాగుండని చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పా. ప్రతి రోజూ దేవుడిని అదే కోరుకునేదాన్ని. కానీ ఫైనల్గా అది నెరవేరనుంది. ఎన్టీఆర్ 30 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఉన్నా. సెట్లోకి అడుగు పెట్టేందుకు దర్శకుడికి రోజూ మెసేజ్లు పెడుతున్నా ఇప్పటికే రెండుసార్లు ఆర్ఆర్ఆర్ చూశా. ఆయన అందం, ఎనర్జీ ఎంతో గొప్పగా ఉంటాయి.' అని చెప్పుకొచ్చింది. అలాగే తన సినీ కెరీర్పై పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.


2 Comments

Post a Comment